Nizamabad RI Satish
ఆకేరు న్యూస్, నిజామాబాద్ : నిజామాబాద్‌లో రిజర్వ్డ్ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ) సతీష్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటన పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.
మృతుడు సతీష్ గతంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహించారు. దాదాపు పదేళ్లపాటు వరంగల్ హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వర్తించినట్లు సమాచారం. ప్రస్తుతం నిజామాబాద్‌లో ఆర్ఐగా విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
సతీష్ స్వస్థలం ఖమ్మం జిల్లా కారేపల్లిగా తెలుస్తోంది. ఆత్మహత్యకు కుటుంబ, ఆర్థిక సమస్యలు కారణమై ఉండొచ్చని ఆయన బంధువులు చెబుతున్నారు. ముఖ్యంగా అప్పులు, ఉద్యోగపరమైన ఒత్తిళ్లతో సతీష్ కొంతకాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు బంధువులు పేర్కొన్నట్లు సమాచారం.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు అసలు కారణాలు ఏమిటన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు, సహచరులను విచారించే అవకాశం ఉంది.
సతీష్ ఆత్మహత్యకు దారితీసిన పూర్తి కారణాలు పోలీసుల దర్యాప్తు అనంతరం వెల్లడికానున్నాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
