Aakasamlo Oka Tara Release Date
* నవంబర్ 20న “ఆకాశంలో ఒక తార”..
* సాత్విక వీరవల్లి, శ్రుతి హాసన్ కీలక పాత్రల్లో..
* నాలుగు భాషల్లో విడుదల
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఆకాశంలో ఒక తార. సాత్విక వీరవల్లి, శ్రుతి హాసన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నారు.
* విభిన్న ప్రమోషన్స్‌తో..
ఆకాశంలో ఒక తారను ప్రేక్షకులకు మరింత చేరువ చేసేందుకు డిఫరెంట్ స్టైల్లో భారీ ప్రమోషన్స్ నిర్వహించేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ చిట్టి చిట్టి చీమకు మంచి స్పందన వచ్చింది. మ్యూజిక్ లవర్స్‌ను ఈ పాట ఆకట్టుకుంటోందని చిత్రబృందం తెలిపింది.
జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శ్వేతా సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.లైట్‌బాక్స్ మీడియా బ్యానర్‌పై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని స్వప్న సినిమా, గీతా ఆర్ట్స్ సంస్థలు సమర్పిస్తున్నాయి. తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానుంది.
సినిమా నుంచి వస్తున్న ప్రతి అప్డేట్తో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోందని మేకర్స్ పేర్కొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
