The Paradise Movie Release
* ఈనెల 24న థియేటర్లలోకి
* నాని, కయాదు లోహార్ ఇంటెన్స్ రొమాన్స్..
* కొత్త పోస్టర్‌కు భారీ స్పందన
ఆకేరు న్యూస్, సినిమా : నాని హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ది ప్యారడైజ్. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సుధాకర్ చెరుకూరి నిర్మాత. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్, టీజర్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.
* కొత్త పోస్టర్‌కు భారీ స్పందన
తాజాగా నాని, కయాదు లోహార్‌ను ఇంటెన్స్ రొమాంటిక్ అవతార్‌లో చూపిస్తూ మేకర్స్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్లో నాని రఫ్ అండ్ రస్టిక్ లుక్‌లో కనిపించగా.. కయాదు లోహార్ కూడా ఇంటెన్స్ అవతార్‌లో ఆకట్టుకున్నారు. ఇద్దరూ ఎదురెదురుగా నిలబడి లైటర్‌తో సిగరెట్లను వెలిగించుకుంటున్న విజువల్ ప్రత్యేకంగా కనిపిస్తోంది.
* సోషల్ మీడియాలో వైరల్..
డార్క్, ఇంటెన్స్ వాతావరణంలో వారి మధ్య బాండింగ్‌ను డిఫరెంట్‌గా ప్రజెంట్ చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హీరో, హీరోయిన్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా ఉండనున్నాయని చిత్రబృందం తెలిపింది. జడల్, సుబ్బు పాత్రల మధ్య ప్రేమకథ ఇంతకుముందెన్నడూ చూడని విధంగా ఉంటుందని పేర్కొంది.
ఇక ది ప్యారడైజ్ సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
