Shruti Haasan
* శృతి హాసన్ సంచలన వ్యాఖ్యలు
Shruti Haasan: ఆకేరు న్యూస్, డెస్క్: ప్రముఖ నటి శృతి హాసన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మహిళలకు పీరియడ్స్ సమయంలో ఎదురయ్యే ఇబ్బందులు, పని ప్రదేశాల్లో వారికి అవసరమైన వెసులుబాటుపై ఆమె ఆసక్తికరంగా స్పందించారు. ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన శృతి హాసన్.. మగవాళ్లకు కూడా పీరియడ్స్ రావాలని తాను ప్రార్థించినట్లు వ్యాఖ్యానించారు.
మగవాళ్లకు కూడా పీరియడ్స్ వస్తే.. చిత్ర పరిశ్రమలో పీరియడ్ హాలిడేస్ గురించి కాంట్రాక్టుల్లో స్పష్టంగా ప్రస్తావించే అవకాశం ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. మహిళల పీరియడ్స్‌ను కూడా ఇతర ఆరోగ్య సమస్యల మాదిరిగానే పరిగణించాలని శృతి హాసన్ సూచించారు.
సెట్లో చెప్పడానికి ఇబ్బంది
గతంలో తాను పీరియడ్స్ గురించి సినిమా షూటింగ్ సెట్లో మాట్లాడటానికి చాలా ఇబ్బంది పడేదానినని శృతి హాసన్ గుర్తుచేసుకున్నారు. ఆ విషయాన్ని బయటకు చెప్పలేకపోయేదానినని తెలిపారు. తన కో-స్టార్‌కు మోకాలికి సర్జరీ జరిగినప్పుడు.. మూవీ టీమ్ వెంటనే పరిస్థితికి అనుగుణంగా పనులను సర్దుబాటు చేసేందుకు సిద్ధమైందని ఆమె పేర్కొన్నారు. అదే విధంగా మహిళలకు ఎదురయ్యే పీరియడ్స్ వంటి ఆరోగ్య సంబంధిత సమస్యలను కూడా అర్థం చేసుకుని, అవసరమైన వెసులుబాటు కల్పించాలని శృతి హాసన్ అన్నారు. ప్రస్తుతం శృతి హాసన్ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు, వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహిళల ఆరోగ్యం, పీరియడ్ హాలిడేస్ అంశంపై ఆమె చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
