Katrina Kaif
Katrina Kaif: ఆకేరు న్యూస్, సినిమా: ప్రసవం తర్వాత మహిళల శరీరాకృతిపై జరుగుతున్న విమర్శలను నటి సోనారికా భడోరియా తప్పుబట్టారు. ఇటీవల నటి కత్రినా కైఫ్ బరువు పెరిగిందంటూ సోషల్ మీడియాలో వచ్చిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెకు సోనారికా మద్దతుగా నిలిచారు. దేవోన్ కే దేవ్… మహాదేవ్ స్పీడున్నోడు , ఈడోరకం ఆడోరకం వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సోనారికా.. తొలుత ఇన్స్టాగ్రామ్ స్టోరీలో, అనంతరం తన ఫీడ్‌లో ఈ విషయంపై స్పందించారు.
* ప్రతి తల్లి గురించి
ఇది కేవలం కత్రినా గురించే కాదు. ప్రసవం తర్వాత ఇంకా కోలుకుంటున్న సమయంలో తమ శరీరంపై విమర్శలు ఎదుర్కొంటున్న ప్రతి తల్లి గురించే అని సోనారికా పేర్కొన్నారు. ఒక బిడ్డను మోసి, జన్మనిచ్చిన తర్వాత మహిళ శరీరం ఎలా కనిపిస్తుందనే దానిపై ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
* శరీరాన్ని గౌరవించాలి
కొత్తగా తల్లులైన మహిళలకు కూడా సోనారికా ఓ సందేశాన్ని ఇచ్చారు. మీ శరీరం పాడైపోలేదు. అది సిగ్గుపడాల్సిన విషయం కాదు. దాని కోసం మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. మాతృత్వం మీపై తన ముద్ర వేసిందని మీరు తక్కువ అందంగా మారిపోలేదు అని ఆమె పేర్కొన్నారు. ప్రసవం తర్వాత మహిళల శరీరంలో వచ్చే సహజ మార్పులను గౌరవించాలని, వాటిపై అనవసర వ్యాఖ్యలు చేయకూడదనే సందేశాన్ని సోనారికా తన పోస్టు ద్వారా ఇచ్చారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
