Station Ghanpur
Station Ghanpur: ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్: సీజనల్ వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జనగామ జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ వాణిశ్రీ సూచించారు. శుక్రవారం స్టేషన్ ఘన్పూర్ డివిజన్ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధుల నియంత్రణకు అవసరమైన చర్యలు చేపట్టాలని, రోగులకు ల్యాబ్ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని సూచించారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. అనంతరం ఆసుపత్రిలోని వార్డులు, రికార్డులు, సిబ్బంది హాజరు తదితర అంశాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీ వాణి, ఆర్బీఎస్కే డాక్టర్ అజయ్ కుమార్, సీహెచ్ఓ జయపాల్ రెడ్డి, ల్యాబ్ టెక్నీషియన్ రాజేష్, ఫార్మసిస్ట్, సూపర్వైజర్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.
పాఠశాలల్లో ఆరోగ్య అవగాహన
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మిషన్ శిఖరం కార్యక్రమంలో భాగంగా స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని జెడ్పీహెచ్ఎస్, హోలీ క్రాస్, కృష్ణవేణి పాఠశాలల్లో ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ శ్రీ వాణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 11 సంవత్సరాలు దాటిన విద్యార్థినులకు మాసిక ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత, మానసిక ఆరోగ్యం అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థినులు ఆరోగ్యంపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్బీఎస్కే డాక్టర్ అజయ్ కుమార్, మండల విద్యాధికారి కుసుమ రమేష్, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, హెల్త్ ఎడ్యుకేటర్ మనోహర రాణి, సూపర్వైజరీ సిబ్బంది రమేష్, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
