Ramappa Temple
Ramappa Temple: ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని టర్కీకి చెందిన ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు శుక్రవారం సందర్శించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో వచ్చిన విదేశీ ప్రతినిధులు ఆలయంలోని అద్భుత శిల్పకళ, కాకతీయుల నిర్మాణ నైపుణ్యాన్ని ఆసక్తిగా తిలకించారు.
ఆలయ అర్చకులు హరీష్ శర్మ, ఉమాశంకర్ ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ మండపంలో ఈఓ ఇమ్మడి భాస్కర్, ఎమ్మెల్సీతో కలిసి విదేశీ ప్రతినిధులను శాలువాలతో సత్కరించారు.
రామప్ప ఆలయ విశిష్టతలను ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి వారికి వివరించారు. ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన తేలికపాటి ఇటుకల ప్రత్యేకతను ప్రత్యక్షంగా చూపించారు. నీటిలో తేలే లక్షణం కలిగిన ఆ ఇటుకల గురించి తెలుసుకున్న విదేశీ ప్రతినిధులు ఆసక్తి వ్యక్తం చేశారు. టూరిజం గైడ్ గోరంటల విజయ్ కుమార్ రామప్ప చరిత్ర, కాకతీయుల వైభవం, శిల్పాల విశిష్టతలను వివరించారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుంకర భిక్షం గౌడ్, పలువురు జిల్లా, మండల నాయకులు, రెవెన్యూ, పోలీస్, దేవాదాయ, పురావస్తు, టూరిజం శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
