DTF
DTF: ఆకేరు న్యూస్, తొర్రూర్: ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (DTF) జిల్లా అధ్యక్షుడు నెల్లూట్ల భాస్కర్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన ఆధ్వర్యంలో తొర్రూర్ మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు ప్రభుత్వం చెల్లించాల్సిన పీఆర్సీ బకాయిలు, పెండింగ్ డీఏలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం మండల, జిల్లా కేంద్రాల్లో పలుమార్లు నిరసనలు, ధర్నాలు చేపట్టినా ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని కోరారు. లేనిపక్షంలో ఉపాధ్యాయులను ఏకం చేసి రాష్ట్రస్థాయిలో పెద్దఎత్తున ధర్నా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
కార్యక్రమంలో డీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు పులిపాటి తిరుమలేష్, జిల్లా కౌన్సిలర్లు సీహెచ్ దర్గయ్య, ఎం. రవీందర్, వి. రవీందర్, శ్రీనివాస్ రెడ్డి, మోమిన్ అలీ, కే. వెంకటేశ్వర్లు, మండల బాధ్యులు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
