Wardhannapet Hospital
* మృతదేహాన్ని కొరుక్కుతిన్న ఎలుకలు
ఆకేరు న్యూస్, వరంగల్ : వర్ధన్నపేట ప్రభుత్వ (Wardhannapet Hospital) ఆస్పత్రిలో దారుణం జరిగింది.. పోస్ట్ మార్టమ్ గదిలో ఉన్న మృతదేహాన్ని ఎలుకలు కొరికేశాయి. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రాయపర్తి మండల కేంద్రానికి చెందిన గారే వీరయ్య మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ గదిలో భద్రపరిచారు. కంటి భాగాన్ని ఎలుకలు కొరికేయడం కలకలం రేపింది.
ఆదివారం ఉదయం శవపరీక్ష కోసం వెళ్లిన కుటుంబ సభ్యులు ఈ దృశ్యాన్ని చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పోస్టుమార్టం గదిలో కనీస మౌలిక వసతులు, ఫ్రీజర్ సౌకర్యం లేకపోవడం వల్లే ఈ దారుణం జరిగిందని అంటున్నారు. శుభ్రత పాటించక పోవడం, శవాల రక్షణ కు అవసరమైన భధ్రతా చర్యలు లేకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరణించిన వారికి కూడా కనీస గౌరవం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మృతుడి బంధువులు డిమాండ్ చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
