Narayanpet Model School
* 30 మంది విద్యార్థినులకు అస్వస్థత..
* 15 మందిని జిల్లా ఆసుపత్రికి తరలింపు
ఆకేరు న్యూస్, నారాయణపేట జిల్లా : ధన్వాడ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. పాఠశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థినులు మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. భోజనం తర్వాత సుమారు 30 మంది విద్యార్థినులకు కడుపు నొప్పి, అసౌకర్యం వంటి సమస్యలు తలెత్తినట్లు సమాచారం.
విద్యార్థినుల పరిస్థితిని గమనించిన పాఠశాల సిబ్బంది వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే వారిలో కొంతమందికి కడుపు నొప్పి తీవ్రంగా ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పరిస్థితి తీవ్రంగా ఉన్న 15 మంది విద్యార్థినులను మెరుగైన వైద్యం కోసం నారాయణపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనతో పాఠశాలలోని ఇతర విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. విద్యార్థినులు అస్వస్థతకు గురికావడానికి కారణం మధ్యాహ్న భోజనమేనా? లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. భోజన నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించే అవకాశం ఉంది. ఘటనపై పూర్తి వివరాలు అధికారుల విచారణ అనంతరం వెల్లడికావాల్సి ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
