Openai bug
* ఏపీ యువకుడి సంచలనం
* ప్రభుత్వ పాఠశాలలో చదివి..
* ఓపెన్ఏఐ లోపాలను సరిదిద్దిన టెకీ మోహన్ పెదపాటి
* రూ.6 లక్షల రివార్డు
ఆకేరు న్యూస్, డెస్క్: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ప్రముఖ ఏఐ (Artificial Intelligence) సంస్థ ‘ఓపెన్ఏఐ’ (OpenAI) వ్యవస్థను ముగ్గురు టెక్ పరిశోధకులు విజయవంతంగా హ్యాక్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక యువకుడు ఉండటం విశేషం. ఓపెన్ఏఐ నిర్వహించిన ‘బగ్ బౌంటీ ప్రోగ్రామ్’లో భాగంగా ఈ హ్యాకింగ్ నిర్వహించారు.
సైబర్ సెక్యూరిటీ స్టార్టప్ ‘హ్యాక్ట్రాన్ ఏఐ’ (Hacktron AI)కి చెందిన హర్ష్ జైశ్వాల్, మోహన్ పెదపాటి, రాహుల్ మైనీలు ఈ బృందంలో ఉన్నారు. ఈ ముగ్గురూ కలిసి కేవలం 72 గంటల పాటు శ్రమించి, ఓపెన్ఏఐ ప్రైవేట్ రిపాజిటరీలో ఉన్న సాంకేతిక లోపాన్ని (Bug) విజయవంతంగా గుర్తించి దానికి యాక్సెస్ సాధించారు.
ఈ విషయాన్ని వెంటనే వారు ఓపెన్ఏఐ సంస్థ దృష్టికి తీసుకెళ్లారు. వారు దీనిని పరిశీలించి నిజమని నిర్ధారించుకున్న వెంటనే ఆ లోపాన్ని సరిదిద్దుకున్నారు. ఈ బృందం చూపిన ప్రతిభకు మెచ్చిన ఓపెన్ఏఐ సంస్థ, వారికి 6,500 డాలర్ల (సుమారు రూ. 6.23 లక్షలు) నగదు బహుమతిని అందజేసి అభినందించింది.
*ప్రభుత్వ పాఠశాల నుంచి గ్లోబల్ లెవెల్ వరకు..
ఓపెన్ఏఐని హ్యాక్ చేసిన ఈ బృందంలో కీలక సభ్యుడైన మోహన్ పెదపాటి.. ‘హ్యాక్ట్రాన్ ఏఐ’ సహ వ్యవస్థాపకులతో పాటు ఆ సంస్థకు సీటీవో (CTO)గా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం సమీపంలోని కొండగుంటూరు ప్రాంతానికి చెందిన మోహన్, స్థానికంగా ఉన్న సంపత్‌నగర్ ప్రభుత్వ పాఠశాలలో తన పదవ తరగతి వరకు విద్యనభ్యసించారు.
ఆ తర్వాత నూజివీడు ట్రిపుల్ ఐటీ (RGUKT)లో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచి ఎథికల్ హ్యాకింగ్‌పై ఉన్న మక్కువతో ఇంజినీరింగ్ పూర్తి కాగానే సైబర్ సెక్యూరిటీ రంగంలోకి అడుగుపెట్టారు. అనేక ప్రముఖ సంస్థల సాఫ్ట్వేర్లలోని బగ్‌లను గుర్తించి ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో నివసిస్తూ సైబర్ సెక్యూరిటీ రంగంలో సేవలు అందిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
