Nitin Nabin BJP Meetings
ఆకేరు న్యూస్, నెట్వర్క్ : ఉత్తరప్రదేశ్ ఎన్నికల సన్నాహాలపై బీజేపీ ప్రధాన కార్యదర్శి నితిన్ నబీన్ (Nitin Nabin) దృష్టి సారించారు. ఇందులో భాగంగా నేడు, రేపు మీరట్, సహారన్పూర్ జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పార్టీ సంస్థాగత బలోపేతం, ఎన్నికల సన్నాహాలపై ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహించనున్నారు.
మీరట్లో ఎంపీలు, ఎమ్మెల్యేలతో నితిన్ నబీన్ భేటీ కానున్నారు. అలాగే శక్తి కేంద్ర సమ్మేళనంలో పాల్గొని పార్టీ శ్రేణులకు ఎన్నికల దిశానిర్దేశం చేయనున్నారు. రేపు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతోనూ ఆయన సమావేశం కానున్నారు.
అనంతరం సహారన్పూర్లో పర్యటించే నబీన్.. అక్కడ పార్టీ నేతలు, కార్యకర్తలతో సంస్థాగత సమావేశాల్లో పాల్గొంటారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలు, సంస్థాగత వ్యవస్థను మరింత బలోపేతం చేయడంపై ఈ సమావేశాల్లో చర్చించనున్నట్లు సమాచారం.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
