Bank Strike September 2026
* సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు
* మూడు రోజుల పాటు సేవలకు విరామం
* ఖాతాదారులకు ప్రత్యామ్నాయాలు ఇవే
ఆకేరు న్యూస్, డెస్క్ : దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి. వివిధ డిమాండ్ల పరిష్కారం కోరుతూ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ఇచ్చిన పిలుపు మేరకు, ఈనెల 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు దేశవ్యాప్త బ్యాంకుల సమ్మె నిర్వహించనున్నారు.
ఐదు రోజుల బ్యాంకింగ్ విధానాన్ని (5-Day Banking) వెంటనే అమలు చేయాలని, అలాగే పెండింగ్‌లో ఉన్న పలు డిమాండ్లను పరిష్కరించాలని UFBU తీవ్రంగా డిమాండ్ చేస్తోంది. ఈ సమ్మె నేపథ్యంలో ఖాతాదారులు తీవ్ర అసౌకర్యానికి గురికాకుండా బ్యాంకులు ముందస్తు అడ్వైజరీ జారీ చేశాయి.
* ఐదు రోజుల పాటు ఇబ్బందులు..
సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో (సోమవారం నుంచి బుధవారం వరకు) బ్యాంక్ యూనియన్లు సమ్మెలో పాల్గొంటున్నాయి. దీనికి తోడు దానికి ముందు వచ్చే శనివారం (సెప్టెంబర్ 26), ఆదివారం (సెప్టెంబర్ 27) సాధారణ వారాంతపు సెలవులు కావడంతో, మొత్తంగా ఐదు రోజుల పాటు (సెప్టెంబర్ 26 నుంచి 30 వరకు) బ్యాంక్ బ్రాంచ్ సేవలు పూర్తిగా లేదా పాక్షికంగా స్తంభించే అవకాశం ఉంది.
దీనిని దృష్టిలో ఉంచుకుని ఖాతాదారులు తమ అత్యవసర ఆర్థిక లావాదేవీలు, చెక్కుల క్లియరెన్స్‌లు లేదా బ్రాంచ్ పనులను ముందుగానే పూర్తి చేసుకోవాలని బ్యాంకులు సూచించాయి.
*ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచన..
శాఖల పనివేళలు నిలిచిపోయినా, ఖాతాదారులు ఇబ్బంది పడకుండా డిజిటల్ సేవలను వినియోగించుకోవాలని బ్యాంకులు కోరాయి. నగదు అవసరాల కోసం ఏటీఎంలు (ATMs), క్యాష్ డిపాజిట్ మెషీన్లు (ADWMs) ఉపయోగించుకోవాలని, అలాగే రోజువారీ లావాదేవీల కోసం యూపీఐ (UPI), మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ మరియు YONO వంటి డిజిటల్ చానెళ్లను ఆశ్రయించాలని స్పష్టం చేశాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
