MGM Hospital
ఆకేరు న్యూస్, వరంగల్ : వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) వాణి చేరుకున్నారు. నిన్న ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఘటన నేపథ్యంలో అధికారులు ఎంజీఎంలో పర్యటించారు. ముందుగా ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో సమావేశమైన కలెక్టర్, డీఎంఈ.. నిన్నటి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఘటన ఎలా జరిగింది? అందుకు దారితీసిన పరిస్థితులు ఏమిటి? ఆసుపత్రి సిబ్బంది ఎలా స్పందించారు? అనే అంశాలపై అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. ఆసుపత్రిలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై కూడా సూపరింటెండెంట్‌తో చర్చించారు.
అనంతరం కలెక్టర్ సత్యశారద, డీఎంఈ వాణి ఆసుపత్రిలోని పలు వార్డులను సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉన్న తీరును పరిశీలించారు. రోగులు, వారి సహాయకులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయనే విషయాలను కూడా తెలుసుకున్నారు.
అలాగే ఎంజీఎం ఓపీ విభాగాన్ని అధికారులు పరిశీలించారు. ఓపీకి వస్తున్న రోగుల సంఖ్య, వైద్య సేవల నిర్వహణ, రోగులకు అందుతున్న సదుపాయాలపై సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత మెరుగ్గా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది.
నిన్నటి ఘటన నేపథ్యంలో కలెక్టర్, డీఎంఈ స్వయంగా ఎంజీఎంను సందర్శించి పరిస్థితులను పరిశీలించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఘటనపై అధికారులు మరింత లోతుగా వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
