The Paradise
ఆకేరు న్యూస్, సినిమా డెస్క్ : నేచురల్ స్టార్ నాని నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘ది ప్యారడైజ్’ విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్-ఇండియా చిత్రానికి నైజాం ప్రాంతంలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన వెంటనే ఊహించని స్థాయిలో స్పందన లభించింది. డిస్ట్రిక్ట్ యాప్‌లో టికెట్లు అందుబాటులోకి రాగానే అభిమానులు పెద్ద ఎత్తున బుకింగ్స్‌కు పోటెత్తారు.
‘దసరా’ వంటి మాస్ హిట్ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా కావడంతో ‘ది ప్యారడైజ్’పై మొదటి నుంచే ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. ప్రమోషనల్ కంటెంట్, పాటలు, పోస్టర్లు సినిమాపై హైప్‌ను పెంచాయి. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులకు చేరువయ్యేలా రూపొందించిన ప్రచార కార్యక్రమాలు, నాని కొత్త లుక్ అభిమానుల్లో ఉత్సాహాన్ని మరింత పెంచాయి.
* క్రేజ్
నైజాం బుకింగ్స్‌కు ముందే టికెటింగ్ యాప్స్‌లో సినిమా ప్రభావం స్పష్టంగా కనిపించింది. బుక్‌మైషోలో 2.16 లక్షలకు పైగా మంది ఈ చిత్రం పట్ల ఆసక్తిని నమోదు చేయగా, డిస్ట్రిక్ట్ బై జొమాటో యాప్‌లో 1.78 లక్షలకు పైగా ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపినట్లు గతంలో వెల్లడైంది. ఈ సంఖ్యలు బుకింగ్స్ ప్రారంభానికి ముందే ‘ది ప్యారడైజ్’కు ఉన్న క్రేజ్‌ను చాటాయి. ఇప్పుడు నైజాం టికెట్ల అమ్మకాలతో ఆ అంచనాలు వాస్తవ రూపం దాల్చినట్లు సినీ వర్గాలు భావిస్తున్నాయి.
* ప్రీమియర్ షో కు అనుమతి
తెలంగాణలో ఈ చిత్రానికి ప్రత్యేక ప్రీమియర్ షోలకు అనుమతి లభించింది. విడుదలకు ముందురోజు సాయంత్రం 6.30 గంటలకు ప్రీమియర్లు నిర్వహించనున్నారు. ఈ షోల టికెట్ ధరను జీఎస్టీతో కలిపి రూ.500గా నిర్ణయించారు. విడుదలైన తర్వాత తొలి నాలుగు రోజుల పాటు సింగిల్ స్క్రీన్లలో అదనంగా రూ.48, మల్టీప్లెక్స్‌లలో అదనంగా రూ.95 వరకు టికెట్ ధరలు వసూలు చేసేందుకు అనుమతి ఉంది. ఆ తరువాతి ఆరు రోజుల పాటు సింగిల్ స్క్రీన్లకు రూ.23, మల్టీప్లెక్స్‌లకు రూ.45 చొప్పున అదనపు ధరలు వర్తించనున్నాయి.
* చిత్రబృందం
‘ది ప్యారడైజ్’లో కయదు లోహర్ కథానాయికగా నటిస్తోంది. మోహన్ బాబు కీలక ప్రతినాయక పాత్రలో కనిపించనుండగా, రాఘవ్ జుయల్, తనికెళ్ల భరణి, సోనాలి కులకర్ణి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
