Mirzapur
ఆకేరు న్యూస్, సినిమా డెస్క్ : ‘మిర్జాపూర్ ది మూవీ’ బాక్సాఫీస్ వద్ద వేగం కొంత తగ్గినా, రికార్డులను బద్దలు కొడుతూ కొత్త మైలురాళ్లను చేరుతోంది. ఆదివారం నాటికి ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల మార్క్‌ను దాటింది. ఈ ఏడాది ఆ ఘనత సాధించిన మూడో హిందీ చిత్రంగా నిలిచింది. ఈ క్రమంలో ఇటీవలి పలు హిట్ చిత్రాల జీవితకాల వసూళ్లను అధిగమించింది.
భక్తి చిత్రం ‘హనుమాన్ అంష్’ రోజువారీ వసూళ్లలో స్వల్పంగా ముందంజలో ఉన్నప్పటికీ, ‘మిర్జాపూర్’ తన జోరును కొనసాగించింది. 17 రోజులకల్లా సినిమా ప్రపంచవ్యాప్త వసూళ్లు రూ.308 కోట్లకు చేరాయి. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల మార్క్‌ను దాటిన మూడో హిందీ చిత్రంగా, మొత్తంగా పదో భారతీయ చిత్రంగా ‘మిర్జాపూర్ ది మూవీ’ నిలిచింది.
* లోకాను అధిగమించిన మిర్జాపూర్
మూడో వారాంతపు వసూళ్లతో ‘మిర్జాపూర్: ది మూవీ’ ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రాల టాప్-10 జాబితాలోకి ప్రవేశించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.308 కోట్ల స్థూల వసూళ్లతో, ఇటీవలి సంవత్సరాల్లో స్లీపర్ హిట్లుగా నిలిచిన యానిమేషన్ చిత్రం ‘మహావతార్ నరసింహ’ రూ.301 కోట్లు, మలయాళ వాంపైర్ యాక్షన్ చిత్రం ‘లోకా చాప్టర్ వన్: చంద్ర’ రూ.304 కోట్ల జీవితకాల వసూళ్లను అధిగమించింది.
* చిత్రబృందం..
ఈ చిత్రంలో అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠీ, దివ్యేందు ప్రధాన పాత్రల్లో నటించారు. వెబ్ సిరీస్‌లో బబ్లు పండిట్ పాత్ర పోషించిన విక్రాంత్ మాస్సే స్థానంలో జితేంద్ర కుమార్ నటించారు. రవికిషన్, అభిషేక్ బెనర్జీ, రసికా దుగ్గల్, మోహిత్ మాలిక్, షీబా చద్దా, రాజేష్ తైలాంగ్, ప్రమోద్ పాఠక్, శ్రియ పిల్గావ్కర్, హర్షిత శేఖర్ గౌర్, శ్వేతా త్రిపాఠీ, సోనల్ ఎస్. చౌహాన్ తదితరులు నటీనటులుగా ఉన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
