Tank Bund Tension
* నిమజ్జనానికి అనుమతి నిరాకరణతో ఆందోళన
ఆకేరు న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద ఈరోజు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నగరంలోని చారిత్రాత్మక హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్పై గణపతి విగ్రహాల నిమజ్జనానికి ప్రభుత్వం అనుమతి నిరాకరించడాన్ని నిరసిస్తూ, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు ఆందోళనకు దిగారు. నిమజ్జనంపై ఉన్న ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ వారు ట్యాంక్ బండ్ వద్ద రోడ్డుపై బైఠాయించారు.
ఈ క్రమంలో, అక్కడి పరిస్థితులను అదుపులో ఉంచడానికి పోలీసులు ఏర్పాటు చేసిన భారీ బారికేడ్లను ఉత్సవ సమితి ప్రతినిధులు తొలగించడానికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఈ ఘటనలో పలువురు పోలీసులు కిందపడిపోయారు. ఉద్రిక్తత పెరగడంతో పోలీసులు అప్రమత్తమై, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
