KTR Financial Support Kondeti Akhira MBBS
* KTR Financial Support.. ఎంబీబీఎస్ చదువుకు సాయం
ఆకేరు న్యూస్, వర్ధన్నపేట : కష్టపడి ఎంబిబిఎస్ సీటు సాధించిన దళిత పేద విద్యార్థి కొండేటి అఖిరాకు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొండంత అండగా నిలిచారు. స్థానిక కౌన్సిలర్ గుజ్జ వీరన్న ఆధ్వర్యంలో హైదరాబాద్ వచ్చిన అఖిరా కుటుంబ సభ్యులను కేటీఆర్ తన కార్యాలయంలో కలుసుకున్నారు.
అఖిరా పూర్తి వైద్య విద్యకు (KTR Financial Support) అయ్యే అన్ని ఆర్థిక ఖర్చులను తానే భరిస్తానని ఈ సందర్భంగా కేటీఆర్ హామీ ఇచ్చారు. కష్టకాలంలో తమ బిడ్డ భవిష్యత్తుకు పెద్ద దిక్కుగా నిలిచిన కేటీఆర్కు, చొరవ చూపిన కౌన్సిలర్ గుజ్జ వీరన్నకు అఖిరా కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
