Petrol Bunk Lease Fraud
* పోలీసులను ఆశ్రయించిన బాధితుడు
ఆకేరు న్యూస్, జనగామ : పెట్రోల్ బంక్‌ను లీజుకు (Petrol Bunk Lease Fraud) ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి నుంచి రూ.23 లక్షలు తీసుకుని మోసం చేసిన ఘటన జనగామలో వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల ప్రకారం.. జనగామలో ఓ పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్న యజమాని, మరో పెట్రోల్ బంక్‌ను లీజుకు ఇప్పిస్తానంటూ గతంలో జనగామలో అధ్యాపకుడిగా పనిచేసి ప్రస్తుతం వరంగల్‌లో నివసిస్తున్న ఓ వ్యక్తిని నమ్మించినట్లు సమాచారం. ఈ క్రమంలో లీజు ఇప్పిస్తాననే హామీతో అతడి నుంచి రూ.23 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే డబ్బులు తీసుకున్న తర్వాత పెట్రోల్ బంక్‌ను (Petrol Bunk Lease Fraud) లీజుకు ఇప్పించకపోవడంతో తాను మోసపోయినట్లు బాధితుడు గుర్తించినట్లు సమాచారం. దీంతో జనగామలోని తన బంధువు ద్వారా పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
