Actress Radha
* 46 కోట్ల చెక్కులపై కేసు
Actress Radha| ఆకేరు న్యూస్, డెస్క్: ప్రముఖ నటి రాధ చెన్నై పోలీసులను ఆశ్రయించారు. తన సోదరి, ప్రముఖ నటి అంబిక, సోదరుడు మల్లికార్జున్‌పై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వ్యాపార లావాదేవీల కోసం గతంలో తాను సంతకం చేసి ఉంచిన సుమారు రూ.46 కోట్ల విలువైన చెక్కులను తన అక్క, తమ్ముడు అనుమతి లేకుండా తీసుకుని దుర్వినియోగం చేశారని రాధ ఆరోపించినట్లు తెలుస్తోంది. ఆ చెక్కుల ద్వారా భారీ మొత్తంలో నగదు విత్‌డ్రా చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.
తన వ్యాపార పత్రాలు, చెక్కులను కుటుంబ సభ్యులే దుర్వినియోగం చేశారని రాధ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఆరోపణలకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
