Prajavani
* కలెక్టర్ ఆదేశం
Hanamkonda| ఆకేరు న్యూస్, హనుమకొండ: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అధికారులను ఆదేశించారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్, అదనపు కలెక్టర్ ఎన్. రవి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
జిల్లా, రెవెన్యూ డివిజన్, మండల స్థాయిల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాలకు మొత్తం 298 అర్జీలు అందాయి. సంబంధిత శాఖల అధికారులకు అర్జీలను పంపించిన కలెక్టర్.. నిర్ణీత సమయంలోగా సమస్యలను పరిష్కరించాలని సూచించారు.
వర్చువల్ విధానంలో ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో మాట్లాడిన కలెక్టర్.. ప్రజావాణి అర్జీల పరిష్కారంపై సమీక్షించారు. అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పెండింగ్లో ఉంచకుండా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శేషాద్రి, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్, డీఆర్డీవో మేన శీను, సీపీవో సత్యనారాయణ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
