CM Revanth Reddy
CM Revanth Reddy| ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ మలిదశ ఉద్యమంలో సేవలందించిన దివంగత లింగాల కేదారి, ఆయన భార్య పుష్పలత కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుంచి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
హనుమకొండలోని శాంతినగర్, పోస్టల్ కాలనీకి చెందిన కేదారి, పుష్పలత దంపతులు తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులకు ఉచితంగా భోజనం, టిఫిన్లు, టీలు అందించారు. సాధారణ హోటల్ నిర్వహిస్తూ సమాజ సేవలో భాగంగా అన్నం వృథా చేయొద్దంటూ ప్రజల్లో అవగాహన కల్పించారు.
కేదారి సెప్టెంబర్ 9న, పుష్పలత సెప్టెంబర్ 10న విషాదకర ఘటనలో మృతి చెందారు. వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి స్పందించి CMRF నుంచి రూ.10 లక్షల సాయం మంజూరు చేయించారు. ఈ మొత్తాన్ని అర్హులైన చట్టబద్ధ వారసులకు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
