K Swaminathan
K Swaminathan: ఆకేరు న్యూస్, చెన్నై: వీ ది లీడర్స్ సంస్థ జనరల్ సెక్రటరీగా కె. స్వామినాథన్‌ను వ్యవస్థాపకుడు కె. అన్నామలై నియమించారు. మీడియా, ప్రచారం, ప్రజా సంబంధాల బాధ్యతలను ఆయన నిర్వహించనున్నారు.
సంస్థ కార్యకలాపాలు, ప్రజా సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఈ నియామకం చేపట్టినట్లు అన్నామలై తెలిపారు. సంస్థ లక్ష్యాలు, సామాజిక కార్యక్రమాలను మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరవేయడంలో స్వామినాథన్ కీలక పాత్ర పోషించనున్నారు.
కాగా, వీ ది లీడర్స్ ను తొలుత రాజకీయ ఉద్యమంగా నిర్మించి, క్యాడర్‌కు శిక్షణ ఇచ్చిన అనంతరం రాజకీయ పార్టీగా మార్చనున్నట్లు అన్నామలై ప్రకటించిన విషయం తెలిసిందే. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని కూడా ఆయన తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
