Tamil Nadu
* విజయ్ ప్రభుత్వానికి షాక్
Tamil Nadu| ఆకేరు న్యూస్, చెన్నై: తమిళనాడులో ముఖ్యమైన నిర్ణయాలను రాజకీయ పార్టీలతో సంప్రదించకుండా తీసుకుంటే.. తమిళగ వెట్రి కళగం (TVK) ప్రభుత్వానికి ఇస్తున్న బయటి మద్దతును పునఃపరిశీలించాల్సి వస్తుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి పి. షణ్ముగం హెచ్చరించారు. సెప్టెంబర్ 19న చెన్నైలోని పట్టినప్పాక్కంలో కొత్త సచివాలయ నిర్మాణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసనలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పట్టినప్పాక్కంలో సచివాలయం నిర్మిస్తే మత్స్యకారుల జీవనోపాధిపై ప్రభావం పడే అవకాశం ఉందని సీపీఐ(ఎం) అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రతిపాదిత స్థలంపై ప్రభుత్వం పునరాలోచించాలని, ప్రత్యామ్నాయ ప్రాంతాన్ని ఎంపిక చేసేందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేసింది. కావేరీ జల వివాదం, ప్రతిపాదిత రెండో విమానాశ్రయం వంటి కీలక అంశాల్లోనూ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరపాలని షణ్ముగం కోరారు. TVK ప్రభుత్వానికి సీపీఐ(ఎం), సీపీఐ బయటి నుంచి మద్దతు ఇస్తున్న నేపథ్యంలో ఆయన తాజా హెచ్చరిక ప్రాధాన్యం సంతరించుకుంది.
అదేవిధంగా TVK ప్రభుత్వానికి ఎన్నికల్లో 34 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయని షణ్ముగం ప్రస్తావిస్తూ.. ముఖ్యమైన నిర్ణయాల విషయంలో ప్రజాస్వామ్య పద్ధతిలో అన్ని పార్టీలతో చర్చించాలని అన్నారు. అయితే పట్టినప్పాక్కం సచివాలయంపై తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని తమిళనాడు మంత్రి ఆధవ్ అర్జున తెలిపారు. ప్రతిపాదనపై డీపీఆర్ సిద్ధం చేసిన తర్వాతే తుది నిర్ణయం ఉంటుందని ఆయన వెల్లడించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
