Train Theft
Train Theft: ఆకేరు న్యూస్, సికింద్రాబాద్: రైళ్లలో బెడ్‌రోల్ అటెండర్లుగా పనిచేస్తూ ప్రయాణికుల బంగారు ఆభరణాలు చోరీ చేసిన ఇద్దరిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. బిహార్‌కు చెందిన రాహుల్ కుమార్ (31), సురేశ్ పాశ్వాన్ (44)లను రిమాండ్‌కు తరలించారు.
థారూ అండ్ సన్స్ సంస్థలో బెడ్‌రోల్ అటెండర్లుగా పనిచేస్తున్న వీరిద్దరూ వ్యసనాలకు అలవాటుపడి, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఏసీ బోగీల్లో ప్రయాణికుల నగలు చోరీ చేయాలని పథకం వేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ నెల 15న దురంతో ఎక్స్‌ప్రెస్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో సికింద్రాబాద్ స్టేషన్‌కు రైలు చేరుకున్నప్పుడు ప్రయాణికులు దిగుతుండగా.. రాహుల్‌కు ఓ ప్రయాణికురాలికి చెందిన బంగారు నల్లపూసల గొలుసు, డైమండ్ పెండెంట్ కనిపించాయి. వాటిని సురేశ్‌కు చూపించి ఇద్దరూ కలిసి చోరీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
బాధితుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన రైల్వే పోలీసులు అనుమానంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు తెలిపారు. వారి నుంచి రూ.1.50 లక్షల విలువైన 22 గ్రాముల బంగారు నల్లపూసల గొలుసు, డైమండ్ పెండెంట్ స్వాధీనం చేసుకున్నట్లు సికింద్రాబాద్ రైల్వే డీఎస్పీ జావీద్, ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్‌గౌడ్ తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
