Krithi Shetty Deepu Character
Krithi Shetty| ఆకేరు న్యూస్, డెస్క్: నటి కృతి శెట్టి పుట్టినరోజు సందర్భంగా ఆమె నటిస్తున్న తాజా చిత్రంలోని పాత్రను చిత్రబృందం పరిచయం చేసింది. సినిమాలో కృతి శెట్టి దీపుగా కనిపించనుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఆమె పాత్రకు సంబంధించిన ప్రత్యేక పోస్టర్ను విడుదల చేశారు.
పోస్టర్లో కృతి శెట్టి లుక్ ఆకట్టుకునేలా ఉండటంతో అభిమానులు, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇప్పటివరకు ఆమె పాత్ర వివరాలను గోప్యంగా ఉంచిన చిత్రబృందం తాజాగా దీపుగా పరిచయం చేయడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది.
జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది. సినిమాలో కృతి శెట్టి పాత్రకు ఎలాంటి ప్రాధాన్యం ఉందో తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.
Happy Birthday, DEEPU @IamKrithiShetty 😉🤗🥳
It has been wonderful watching you bring so much energy, innocence and freshness to #January12Vidudala with your performance.
Wishing you an amazing year ahead ✨ pic.twitter.com/6wAhf70h9L
— Anil Ravipudi (@AnilRavipudi) September 21, 2026

Please tell us what is wrong. Your report will be sent to the website team.

