Online Trading Scam
* 800 మందికి కుచ్చుటోపీ
Online Trading Scam| ఆకేరు న్యూస్, హైదరాబాద్: అధిక లాభాలు వస్తాయంటూ నమ్మించి హయత్నగర్లో భారీ ఆన్లైన్ ట్రేడింగ్ మోసం జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. QVSE పేరుతో ఉన్న ఆన్లైన్ ట్రేడింగ్ యాప్లో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని వెంకటేశ్వర అప్ప అనే వ్యక్తి స్థానికులను నమ్మించినట్లు పోలీసులు, బాధితులు తెలిపారు.
ఒకే కాలనీకి చెందిన సుమారు 800 మంది రూ.50 వేల నుంచి లక్షల రూపాయల వరకు ఈ యాప్లో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. తొలుత కొంత లాభం చూపించి నమ్మకం కలిగించిన నిర్వాహకుడు.. భారీగా డబ్బులు సేకరించిన అనంతరం యాప్ను మూసివేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. దీంతో తమ డబ్బులు పోయాయని గుర్తించిన బాధితులు హయత్నగర్ పోలీసులను ఆశ్రయించారు.
బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సైబర్ క్రైమ్ విభాగం సహాయంతో యాప్ నిర్వాహకుల బ్యాంక్ ఖాతాలు, సర్వర్ వివరాలు, కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. ఈ వ్యవహారంలో సుమారు రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు మోసం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. గుర్తుతెలియని ఆన్లైన్ ట్రేడింగ్ యాప్లను నమ్మి పెట్టుబడులు పెట్టవద్దని పోలీసులు ప్రజలను హెచ్చరించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
