Ganesh Immersion
Ganesh Immersion: ఆకేరు న్యూస్, రాయపర్తి: గణేష్ నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించే నిమజ్జన ఊరేగింపుల్లో నిబంధనలు తప్పక పాటించాలని ఏసీపీ అంబటి నర్సయ్య సూచించారు. రాయపర్తి మండల కేంద్రంలోని మంచినీళ్ల చెరువును మండల అధికారులతో కలిసి పరిశీలించిన ఆయన.. వివిధ గ్రామాల్లో నిర్వహించే నిమజ్జన కార్యక్రమాలపై నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.
ఊరేగింపుల్లో డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అధిక శబ్దంతో ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే డీజే నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ఊరేగింపులు నిర్వహించాలని సూచించారు.
నిమజ్జనం సందర్భంగా మద్యం సేవించి గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉత్సవ కమిటీ సభ్యులే బాధ్యత వహించాలని ఏసీపీ నర్సయ్య కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎం. శ్రీనివాస్, ఎంపీడీవో పాక శ్రీనివాస్, ఆర్ఐ కొయ్యాడ చంద్రమోహన్, ఎస్సై ముత్యం రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
