AP Heavy Rains
* బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం
ఆకేరు న్యూస్, అమరావతి : బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఈ అల్పపీడనం క్రమంగా బలపడి విశాఖపట్నం–గోపాలపూర్ మధ్య ఎల్లుండి తెల్లవారుజాములోపు తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి ఏపీలో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంత జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండొచ్చని అధికారులు సూచిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచిస్తున్నారు.
*తీవ్రంగా మారనున్న వాయుగుండం..
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. రానున్న కొన్ని గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అనంతరం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు అర్ధరాత్రి సమయంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
విశాఖపట్నం–గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో తీర ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. వాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. దీంతో సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.
* పలు జిల్లాల్లో భారీ వర్షాలు..
వాయుగుండం ప్రభావంతో ఇవాళ ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్రలోని మిగిలిన జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
వాయుగుండం తీరం దాటే సమయంలో తీర ప్రాంతాల్లో భారీ వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తీరం దాటే సమయంలో పరిస్థితులను బట్టి మరిన్ని వాతావరణ హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
