Asian Games 2026
* శ్రీలంకపై 147 పరుగుల విజయం
* స్మృతి మెరుపు ఇన్నింగ్స్
Asian Games 2026: ఆకేరు న్యూస్, స్పోర్ట్స్ డెస్క్: 2026 ఆసియా క్రీడల్లో భారత్ స్వర్ణంతో బోణీ కొట్టింది. మహిళల క్రికెట్ జట్టు ఫైనల్లో శ్రీలంకపై 147 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి దేశానికి తొలి స్వర్ణ పతకాన్ని అందించింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 216 పరుగులు చేసింది. స్మృతి మందాన 79 పరుగులతో చెలరేగగా.. షఫాలీ వర్మ 48, రిచా ఘోష్ 22 బంతుల్లోనే అజేయంగా 49 పరుగులు చేసి భారీ స్కోరుకు బాటలు వేశారు. ఆసియా క్రీడల మహిళల క్రికెట్లో భారత్కు ఇదే అత్యధిక స్కోరు.
217 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక భారత బౌలర్ల ధాటికి 15.4 ఓవర్లలో కేవలం 69 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ 147 పరుగుల ఘన విజయాన్ని నమోదు చేసి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంతో భారత మహిళల జట్టు ఆసియా క్రీడల్లో స్వర్ణాన్ని నిలబెట్టుకుంది. 2023 హాంగ్జౌ ఆసియా క్రీడల్లోనూ భారత్ మహిళల క్రికెట్లో స్వర్ణం సాధించింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
