PV Sindhu
* IOA ఛైర్‌పర్సన్‌గా సింధు
* 2030 వరకు కీలక బాధ్యతలు
ఆకేరు న్యూస్, డెస్క్ : భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఖాతాలో మరో ప్రతిష్ఠాత్మక పదవి చేరింది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) అథ్లెట్స్ కమిషన్‌కు ఆమె ఛైర్‌పర్సన్‌గా ఎంపికయ్యారు. ఇప్పటికే అంతర్జాతీయ వేదికలపై భారత కీర్తిని చాటిన సింధుకు ఈ బాధ్యతలు అప్పగించడం క్రీడారంగంలో ఆసక్తికరంగా మారింది.
* హర్మన్‌ప్రీత్‌కు కీలక పదవి
భారత హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్‌కు కూడా IOAలో కీలక బాధ్యతలు దక్కాయి. అథ్లెట్స్ కమిషన్ వైస్ ఛైర్‌పర్సన్‌గా ఆయన వ్యవహరించనున్నారు. దీంతో బ్యాడ్మింటన్, హాకీ రంగాలకు చెందిన ఇద్దరు ప్రముఖ క్రీడాకారులు కమిషన్ నాయకత్వంలో కీలక పాత్ర పోషించనున్నారు.
IOA జనరల్ బాడీలో క్రీడాకారుల తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు వెయిట్‌లిఫ్టింగ్ స్టార్ మీరాబాయ్ చాను, స్విమ్మర్ సజన్ ప్రకాశ్ ఎన్నికయ్యారు. వీరి ఎంపికతో వివిధ క్రీడా విభాగాలకు చెందిన అథ్లెట్లకు సంఘంలో ప్రాతినిధ్యం లభించనుంది.
* భారత క్రీడారంగంలో సింధుకు మరో గుర్తింపు..
పీవీ సింధు, హర్మన్‌ప్రీత్ సింగ్‌లు అథ్లెట్స్ కమిషన్ బాధ్యతలతో పాటు IOA ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లోనూ సభ్యులుగా కొనసాగనున్నారు. వీరి పదవీకాలం 2030 వరకు ఉండనుంది. క్రీడాకారుల హక్కులు, సంక్షేమం, వారికి ఎదురయ్యే సమస్యలు, అవసరమైన సదుపాయాల కల్పన వంటి అంశాల్లో అథ్లెట్స్ కమిషన్ కీలక పాత్ర పోషిస్తుంది.
ఈ నేపథ్యంలో పీవీ సింధుకు ఛైర్పర్సన్ బాధ్యతలు దక్కడంతో క్రీడాకారుల సమస్యలను ఉన్నతస్థాయిలో ప్రస్తావించే అవకాశం ఏర్పడింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన స్టార్ క్రీడాకారిణికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపుతో పాటు మరో కీలక బాధ్యత దక్కడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

