Raghava Lawrence
* మహావీర్ కర్ణ లో పౌరాణిక పాత్ర
Raghava Lawrence: ఆకేరు న్యూస్, సినిమా డెస్క్: విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు రాఘవ లారెన్స్ ఇప్పుడు పౌరాణిక పాత్రలో కనిపించనున్నారు. దర్శకుడు రమేశ్ వర్మ తెరకెక్కిస్తున్న మహావీర్ కర్ణ చిత్రంలో ఆయన మహాభారతంలోని కర్ణుడి పాత్రను పోషిస్తున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటిస్తూ.. కర్ణుడి పాత్రలో రాఘవ లారెన్స్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది.
* సంతోషంగా ఉంది
కర్ణుడి వంటి గొప్ప పాత్రను పోషించే అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందని రాఘవ లారెన్స్ తెలిపారు. ఇలాంటి కథ తన వద్దకు వస్తుందని ఊహించలేదని, ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు రమేశ్ వర్మకు కృతజ్ఞతలు తెలిపారు. సినిమా ప్రయాణంలో ప్రేక్షకుల ఆశీస్సులు, మద్దతు కోరారు.
* 2027లో విడుదల
మహాభారతంలోని కర్ణుడి కథ ఆధారంగా మహావీర్ కర్ణ ను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
