Shah Rukh Khan at Lalbaugcha raja Ganesh
ఆకేరు న్యూస్, ముంబయి: బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కుటుంబం ముంబయిలోని ప్రముఖ గణేశ్ ఆలయం లాల్బాగ్చా రాజాను దర్శించుకుంది. షారుఖ్ భార్య గౌరీ ఖాన్, కుమారుడు అబ్రామ్ కలిసి ఆలయానికి వెళ్లి గణనాథుడి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు సమాచారం.
* వైరల్గా ఫొటోలు, వీడియోలు
గౌరీ ఖాన్, అబ్రామ్ ఆలయానికి చేరుకున్న సమయంలో అభిమానులు వారిని చూసేందుకు ఆసక్తి చూపించారు. పూజల అనంతరం ఆలయ నిర్వాహకులు వారికి తీర్థప్రసాదాలు అందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.

* అభిమానుల దృష్టిని ఆకర్షించిన కుటుంబం
గణేశ్ చతుర్థి సందర్భంగా లాల్బాగ్చా రాజాను దర్శించుకునేందుకు సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. ఈ క్రమంలో షారుఖ్ కుటుంబం గణనాథుడిని దర్శించుకోవడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది.


Please tell us what is wrong. Your report will be sent to the website team.
