Rani Mukerji with her mother Krishna Mukherjee
* ప్రముఖుల నివాళి
ఆకేరు న్యూస్, ముంబయి: బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ తల్లి, ప్రముఖ నిర్మాత రామ్ ముఖర్జీ సతీమణి కృష్ణ ముఖర్జీ (75) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మంగళవారం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతితో ముఖర్జీ కుటుంబంలో విషాదం నెలకొంది.
* రాణి కెరీర్లో కీలక పాత్ర
కృష్ణ ముఖర్జీకి సినీ రంగంతో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఆమె భర్త రామ్ ముఖర్జీ (Ram Mukherjee) నిర్మాత, దర్శకుడిగా బాలీవుడ్లో గుర్తింపు పొందారు. రాణి ముఖర్జీ (Rani Mukerji) నటిగా ఎదిగే క్రమంలో తల్లిదండ్రులు అందించిన ప్రోత్సాహం కీలకంగా నిలిచింది. ముఖ్యంగా కృష్ణ ముఖర్జీ (Krishna Mukherjee) తన కుమార్తెకు ఎప్పుడూ అండగా నిలిచేవారని కుటుంబ సన్నిహితులు తెలిపారు.
* ప్రముఖుల సంతాపం
రాణి ముఖర్జీ ‘రాజా కి ఆయేగీ బారాత్’, ‘గులామ్’, ‘కుచ్ కుచ్ హోతా హై’, ‘సాథియా’, ‘బ్లాక్’, ‘మర్దానీ’ తదితర చిత్రాలతో బాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కృష్ణ ముఖర్జీ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

