Sripathipalli
Sripathipalli: ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్: కష్టజీవుల రాజ్యం ఎర్రజెండాతోనే సాధ్యమవుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.డి. అబ్బాస్ అన్నారు. జనగామ జిల్లా చిల్పూర్ మండలం శ్రీపతిపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు రైతులు, యువత, కార్మికులు సీపీఎంలో చేరారు. ఈ సందర్భంగా అబ్బాస్, సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం. కనకారెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాపర్తి రాజు నూతనంగా పార్టీలో చేరిన వారికి ఎర్ర కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమానికి మండల కార్యదర్శి సాదం రమేష్ అధ్యక్షత వహించారు.
ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాలి
అబ్బాస్ మాట్లాడుతూ.. పేదలు, కష్టజీవులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీల సమస్యలపై సీపీఎం ప్రజల పక్షాన పోరాడుతోందని తెలిపారు. దోపిడీ, అసమానతలు లేని సమసమాజ నిర్మాణమే సీపీఎం లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల హక్కుల కోసం పోరాడే ఎర్రజెండా ఉద్యమంలో యువత, రైతులు, కార్మికులు, కష్టజీవులు పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ప్రజా ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటాం
నూతనంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై సీపీఎం చేస్తున్న పోరాటాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నామని తెలిపారు. భవిష్యత్తులో ప్రజా ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు మునిగాల రమేష్, అపారదాపు రాజు, ఆవుల ప్రభాకర్, నాగరాజు, శ్రవణ్, రాజేందర్, మామిడి శేఖర్, బర్మ పోశయ్య, నరాల రవీందర్, ఆసరి రాజయ్య, ముక్కెర రవి, పేల్లి కనకయ్య, మామిడి రాజు, మామిడి కుమార్, సలబాల రాజు, నక్కా సత్యనారాయణ, వెంకన్న, భారతయ్య తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
