Kadambari Kiran
* కాదంబరి కిరణ్ శ్రీకారం
Kadambari Kiran| ఆకేరు న్యూస్, హైదరాబాద్: అనాథలు, ఒంటరి వృద్ధులు, పేదలకు అండగా నిలిచేందుకు మనం సైతం ఫౌండేషన్ మరో బృహత్తర సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సపర్య – వుయ్ కేర్ ఫర్ అన్ కేర్డ్ పేరుతో నూతన ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, నటుడు కాదంబరి కిరణ్ ప్రకటించారు. హైదరాబాద్లోని తెలుగు ఫిలిం ఛాంబర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత 13 ఏళ్లుగా మనం సైతం ద్వారా ఆపదలో ఉన్నవారికి, ఆర్థికంగా వెనుకబడిన వారికి వివిధ రకాలుగా సేవలు అందిస్తున్నామని తెలిపారు. సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలనే ఉద్దేశంతో సపర్య ప్రాజెక్టును రూపొందించినట్లు చెప్పారు.
వృద్ధాశ్రమంతో పాటు వైద్యం
సపర్య లో భాగంగా అనాథాశ్రమం, వృద్ధాశ్రమంతో పాటు పేదలకు అందుబాటులో ఉండే జనతా వైద్యం ఆసుపత్రిని ఏర్పాటు చేయనున్నట్లు కాదంబరి కిరణ్ తెలిపారు. పెద్ద వాటర్ పాండ్, వాకింగ్ ట్రాక్, పచ్చని వనం, ప్రశాంతమైన వాతావరణం ఉండేలా ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. ఒంటరిగా మిగిలిన వృద్ధులకు వసతి, వైద్యం, ఆత్మీయత అందించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశాల్లో ఒకటని పేర్కొన్నారు.
ఉచిత కోచింగ్
సినీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల పిల్లల కోసం ప్రత్యేక విద్యా కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నట్లు కాదంబరి కిరణ్ వెల్లడించారు. క్వాలిటీ థాట్ ఫ్యూచర్ స్కిల్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ప్రతి సంవత్సరం ఐదుగురు సినీ కార్మికుల పిల్లలకు ఉచిత హాస్టల్ వసతితో పాటు రెండేళ్ల పాటు నీట్ శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. మరో ఐదుగురు విద్యార్థులకు ఉచిత ఐఐటీ కోచింగ్ ఇవ్వనున్నట్లు చెప్పారు.
పేదవాళ్లే నా కుటుంబం
తన 40 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని కాదంబరి కిరణ్ తెలిపారు. సాటి మనిషికి తన వంతు సాయం చేయడంలోనే నిజమైన తృప్తి ఉందనే భావనతో మనం సైతం ను ప్రారంభించానని చెప్పారు. సర్వీస్ ఈజ్ గాడ్ అనే నినాదంతో సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని, ‘సపర్య’కు దాతలు, సినీ ప్రముఖులు, పరిశ్రమ పెద్దలు సహకరించాలని కోరారు

Please tell us what is wrong. Your report will be sent to the website team.
