The Paradise
* 23 రాత్రి నుంచే సెలబ్రేషన్స్
* వైల్డ్‌ఫైర్‌లా ఉంటుందన్న నాని
The Paradise| ఆకేరు న్యూస్, సినిమా: నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కిన పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ వేడుకలో నాని మాట్లాడుతూ.. సినిమా కోసం యూనిట్ సభ్యులంతా ఎంతో కష్టపడ్డారని తెలిపారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో తనకు అన్నదమ్ముల అనుబంధం ఉందన్నారు. మోహన్‌బాబు, సోనాలి కులకర్ణి, రాఘవ్, సంపూర్ణేష్ బాబు తదితరులు అద్భుతంగా నటించారని ప్రశంసించారు. అనిరుధ్ ఈ సినిమాకు ప్రాణం పెట్టి సంగీతం అందించారని చెప్పారు.
23 రాత్రి నుంచే సెలబ్రేషన్స్
23 రాత్రి నుంచే థియేటర్లలో సెలబ్రేషన్స్ ప్రారంభమవుతాయి. థియేటర్లు ఊగిపోతాయి. సినిమా మొదలైనప్పుడే ప్రేక్షకులకు వైల్డ్ఫైర్లాంటి అనుభూతి వస్తుంది. నాపై మీరు పెట్టుకున్న నమ్మకంతో చెబుతున్నా.. నెగెటివిటీని పట్టించుకోకుండా పాజిటివిటీతో ముందుకు వెళ్తాం. డైరెక్ట్‌గా థియేటర్లో కలుసుకుందాం.. సెలబ్రేట్ చేసుకుందాం అని నాని అన్నారు.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ఈ వేడుకలో అభిమానుల ఉత్సాహం చూస్తుంటే సినిమా విడుదలకు ముందే విజయోత్సాహం కనిపిస్తోందన్నారు. నాని ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోగా ఎదిగారని పేర్కొన్నారు. దసరా తర్వాత ప్యారడైజ్ తో మరో విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు. చిత్ర నిర్మాత సుధాకర్ చెరుకూరి మాట్లాడుతూ.. ప్యారడైజ్ కోసం టీమ్ మొత్తం ఎంతో కష్టపడిందని, సినిమా అద్భుతంగా వచ్చిందన్నారు. సెప్టెంబర్ 24న థియేటర్లలో ప్రేక్షకులు ఆ శ్రమను చూస్తారని తెలిపారు.
హీరోయిన్ కయాదు లాహోర్ మాట్లాడుతూ.. నానితో కలిసి పనిచేయడం గొప్ప అనుభవమని, తమ జోడీ ప్రేక్షకులకు నచ్చుతుందని అన్నారు. నటుడు రాఘవ్, సంపూర్ణేష్ బాబు, సోనాలి కులకర్ణి తదితరులు కూడా చిత్రంపై తమ అనుభవాలను పంచుకున్నారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, గ్లింప్స్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచాయి. సెప్టెంబర్ 24న ది ప్యారడైజ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
