Hyderabad
* మాదాపూర్‌లో అనుమానాస్పద ఘటన..
* ప్రియుడు పరార్
Hyderabad: ఆకేరు న్యూస్, హైదరాబాద్: మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ యువతి హోటల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్‌కు చెందిన షరోన్ నికిత తోప్నో (29) గచ్చిబౌలిలోని డీఎల్ఎఫ్ సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తోంది. ఆమెకు విశాఖపట్నానికి చెందిన శ్రీనివాస రవితేజతో కొంతకాలంగా పరిచయం ఉంది.
హోటల్‌కు కలిసి వచ్చిన ఇద్దరూ
కలుసుకునేందుకు విశాఖ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన శ్రీనివాస రవితేజ.. మాదాపూర్‌లోని సిద్ధిఖీనగర్ రోడ్డు నంబర్ 5లో ఓ హోటల్లో గది బుక్ చేసుకున్నాడు. సోమవారం మధ్యాహ్నం నికిత హోటల్‌కు చేరుకోగా, అనంతరం శ్రీనివాస్ కూడా అక్కడికి వచ్చాడు. అర్ధరాత్రి సమయంలో నికిత అపస్మారక స్థితిలో పడిపోయినట్లు శ్రీనివాస్ హోటల్ సిబ్బందికి తెలిపాడు.
ఆస్పత్రికి తరలించేలోపే మృతి
హోటల్ సిబ్బంది అంబులెన్స్‌కు ఫోన్ చేయగా.. ఆలస్యమవుతుందని చెప్పిన శ్రీనివాస్, నికితను తన బైక్‌పై కొండాపూర్‌లోని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నికిత ముఖంపై గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
దీంతో హోటల్ గదిలో ఏం జరిగిందనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరి మధ్య గొడవ జరిగిందా? గాయాల కారణంగానే ఆమె మృతి చెందిందా? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. క్లూస్ టీమ్ హోటల్ గదిని పరిశీలించి ఆధారాలు సేకరించిన అనంతరం గదిని సీజ్ చేసింది. నికిత మృతి అనంతరం శ్రీనివాస రవితేజ అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అతడి కోసం గాలిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి, నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
