Telangana Eagle Force
* డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యం
* సీఎం రేవంత్ రెడ్డి
Telangana Eagle Force| ఆకేరు న్యూస్, హైదరాబాద్: మాదకద్రవ్యాల నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. రాష్ట్రంలో డ్రగ్స్ విక్రయం, వినియోగాన్ని అరికట్టేందుకు ఏర్పాటు చేసిన తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (TGNAB) ఈగల్ ఫోర్స్ దేశంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచింది.
వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల యాంటీ నార్కోటిక్స్ టాస్క్‌ఫోర్స్‌ల ఆధ్వర్యంలో నిర్వహించిన మూడో జాతీయ సదస్సులో ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య జాతీయ స్థాయి అత్యుత్తమ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ పోలీసు శాఖకు అభినందనలు తెలిపారు.
డ్రగ్స్ నియంత్రణ కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని సీఎం పేర్కొన్నారు. యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
నషా ముక్త భారత్ లక్ష్యానికి అనుగుణంగా 2029 డిసెంబర్ నాటికి డ్రగ్స్ రహిత తెలంగాణను నిర్మించే దిశగా ఈగల్ ఫోర్స్ మరింత దృఢంగా పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు కొనసాగించాలని అధికారులను ఆదేశించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
