Ganesh Immersion
* 10 వేలకు పైగా విగ్రహాలు..
* పోలీసులతో బందోబస్తు
Ganesh Immersion| ఆకేరు న్యూస్, వరంగల్: వినాయక నవరాత్రి ఉత్సవాల చివరి ఘట్టమైన గణేష్ నిమజ్జనోత్సవం గ్రేటర్ వరంగల్ పరిధిలో అట్టహాసంగా ప్రారంభమైంది. వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రై-సిటీస్ పరిధిలో భక్తులు ప్రతిష్ఠించిన గణనాథులను నిమజ్జన కేంద్రాలకు తరలిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా GWMC, పోలీసు శాఖలు పకడ్బందీ ఏర్పాట్లు చేశాయి.
ప్రత్యేక నిమజ్జన కేంద్రాలు
ట్రై-సిటీస్ పరిధిలో 10 వేలకు పైగా గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రధాన చెరువులు, కుంటల వద్ద ప్రత్యేక నిమజ్జన కేంద్రాలను ఏర్పాటు చేసి గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. విగ్రహాల తరలింపునకు ప్రత్యేక రూట్లను కేటాయించారు.
సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా
నిమజ్జన ప్రాంతాలు, శోభాయాత్ర మార్గాల్లో వందలాది సీసీ కెమెరాలు, డ్రోన్లతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ట్రై-సిటీస్‌లో 1,600 మందికి పైగా పోలీసులను బందోబస్తుకు మోహరించారు.
ట్రాఫిక్ మళ్లింపు
శోభాయాత్రల నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో పోలీసులు పలు మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లించారు. ఆర్టీసీ బస్సులకు కూడా ప్రత్యామ్నాయ మార్గాలను కేటాయించారు. ప్రయాణికులు పోలీసుల సూచనలు పాటించాలని అధికారులు కోరారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
