* GDPR ఉల్లంఘనలు
Google| ఆకేరు న్యూస్, డెస్క్: వినియోగదారుల లొకేషన్ డేటా నిర్వహణలో యూరోపియన్ యూనియన్ GDPR నిబంధనలను ఉల్లంఘించినందుకు టెక్ దిగ్గజం గూగుల్‌కు భారీ జరిమానా పడింది. ఐర్లాండ్ డేటా ప్రొటెక్షన్ కమిషన్ (DPC) గూగుల్‌పై 403 మిలియన్ యూరోలు (సుమారు రూ.3,700 కోట్లు) జరిమానా విధించింది.
* లొకేషన్ డేటాపై విచారణ
2018 మే 25 నుంచి 2020 ఫిబ్రవరి 4 మధ్య గూగుల్ వినియోగదారుల లొకేషన్ డేటాను ప్రాసెస్ చేసిన తీరుపై DPC దర్యాప్తు చేసింది. డేటా ఎలా సేకరిస్తున్నారు, ఎలా ఉపయోగిస్తున్నారు అనే విషయాలను వినియోగదారులకు తగినంత స్పష్టంగా తెలియజేయలేదని కమిషన్ గుర్తించింది.
* ఆరు నెలల్లో మార్పులు
2020లో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ దర్యాప్తు ప్రారంభమైంది. తాజాగా జరిమానాతో పాటు ఆరు నెలల్లోగా డేటా ప్రాసెసింగ్ విధానాలను GDPR నిబంధనలకు అనుగుణంగా మార్చుకోవాలని గూగుల్‌ను DPC ఆదేశించింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
