Telangana High Court
* డిసెంబర్ 5న వర్కింగ్ డే
Telangana High Court| ఆకేరు న్యూస్, హైదరాబాద్: గణేష్ నిమజ్జన శోభాయాత్రల నేపథ్యంలో తెలంగాణ హైకోర్టుకు సెప్టెంబర్ 25, 2026 (శుక్రవారం) సెలవు ప్రకటించారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్టర్ జనరల్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సెలవు తెలంగాణ హైకోర్టుతో పాటు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలోని కోర్టులు, మేడ్చల్–మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల్లోని సంబంధిత న్యాయస్థానాలకు వర్తిస్తుంది.
అలాగే సికింద్రాబాద్లోని తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీ, హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ, మీడియేషన్ అండ్ ఆర్బిట్రేషన్ సెంటర్కు కూడా ఈ సెలవు వర్తించనుంది.
డిసెంబర్ 5న వర్కింగ్ డే
సెప్టెంబర్ 25న ప్రకటించిన సెలవుకు బదులుగా డిసెంబర్ 5, 2026 (శనివారం)ను కోర్టు పనిదినంగా ప్రకటించారు. న్యాయవాదులు, కక్షిదారులు, కోర్టు సిబ్బంది ఈ మార్పును గమనించాలని అధికారులు సూచించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
