Ganesh Immersion
* అభ్యంతరకర పోస్టులపై కేసులు
ఆకేరు న్యూస్,హైదరాబాద్ : గణేష్ నిమజ్జనాన్ని పురస్కరించుకుని సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు, వీడియోలు పెడుతున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న వీడియోలను పరిశీలిస్తూ పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ప్రమాదకర విన్యాసాలకు పాల్పడిన నలుగురిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
మరోవైపు గణేష్ ఉత్సవాల్లో (Ganesh Immersion Hyderabad) మహిళల భద్రతకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఖైరతాబాద్, బాలాపూర్ ప్రాంతాల్లో షీ టీమ్స్‌ను మోహరించి నిఘా పెంచారు. ఈవ్‌టీజింగ్, మహిళల వేధింపులకు పాల్పడే వారిపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఉత్సవాల సందర్భంగా ఇప్పటివరకు పోలీసులు 1,530 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో 724 మందికి కౌన్సెలింగ్ ఇచ్చి అనంతరం వదిలిపెట్టారు. గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా సోషల్ మీడియా కార్యకలాపాలతో పాటు ప్రధాన నిమజ్జన ప్రాంతాల్లోనూ పోలీసులు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
