Hyderabad Ganesh Immersion
*రంగంలోకి కేంద్ర బలగాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. నగరవ్యాప్తంగా సుమారు 20 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించనున్నారు.
నగరంలోని కీలక ప్రాంతాల్లో 10 వేల సీసీ కెమెరాలు, 24 డ్రోన్లతో నిరంతరం నిఘా కొనసాగించనున్నారు. నిమజ్జనానికి తరలివచ్చే భారీ విగ్రహాలను పర్యవేక్షించేందుకు 100 హైరైజ్ కెమెరాలను ఏర్పాటు చేసి.. విగ్రహాల లెక్కింపును చేపట్టనున్నారు.
భద్రత కోసం 8,142 మంది అదనపు సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నారు. 42 ప్లాటూన్ల బలగాలతో పాటు 4 RAF, 2 CRPF కంపెనీల కేంద్ర బలగాలను కూడా మోహరించనున్నారు. దీంతో ప్రధాన నిమజ్జన మార్గాలు, చెరువులు, రద్దీ ప్రాంతాల్లో పటిష్ట భద్రత కొనసాగనుంది.
నిమజ్జన ఏర్పాట్లు, ట్రాఫిక్, శాంతిభద్రతలను సమన్వయం చేసేందుకు నగరంలోని నాలుగు ప్రాంతాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తూ 26 షీ-టీమ్స్‌ను మూడు షిఫ్టుల్లో విధుల్లో ఉంచనున్నారు.
భారీ సంఖ్యలో భక్తులు, గణేష్ విగ్రహాలు నిమజ్జనానికి తరలివచ్చే అవకాశం ఉండటంతో.. ట్రాఫిక్ నియంత్రణ, రద్దీ నిర్వహణ, మహిళల భద్రత, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టనున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
