Tadvai Pasra Road Accident
Published:
Updated: 25 Sep 2026 • 01:28 PM
* 15 మందికి పైగా తీవ్ర గాయాలు
ఆకేరు న్యూస్, ములుగు జిల్లా : తాడ్వాయి మండలంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తాడ్వాయి–పస్రా మధ్య బస్సు, బొలెరో వాహనం ఢీకొన్నాయి. వరంగల్ నుంచి గుంటూరు వెళ్తున్న బస్సు.. భద్రాచలం నుంచి మల్లంపల్లి–రామచంద్రాపురం వైపు వెళ్తున్న బొలెరో వాహనం ఢీకొన్నట్లు సమాచారం.
ఈ ప్రమాదంలో 15 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను అంబులెన్స్‌ల ద్వారా ములుగు ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదానికి గల కారణాలు, క్షతగాత్రుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ వార్తకు సంబంధించిన బృందం

కరస్పాండెంట్
ఇనుగాల కిశోర్ , MA (Mass Communication )
12 సంవత్సరాలుగా జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్నారు..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
