Wine Shop Theft
* రూ.4.25 లక్షలు అపహరణ
ఆకేరు న్యూస్, వరంగల్ జిల్లా : వర్ధన్నపేట పట్టణంలో దొంగలు రెచ్చిపోయారు. పట్టణంలోని రెండు వైన్‌షాపుల్లో (Wine Shop Theft) చొరబడిన దుండగులు భారీగా నగదు అపహరించారు. ఈ ఘటనలో మొత్తం రూ.4.25 లక్షల నగదు చోరీకి గురైంది.
వర్ధన్నపేటలోని మల్లికార్జున వైన్స్‌లో రూ.3.60 లక్షలు, రేణుక ఎల్లమ్మ వైన్స్‌లో రూ.65 వేల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. రాత్రి సమయంలో వైన్షాపుల్లోకి చొరబడిన దొంగలు నగదును అపహరించి పరారైనట్లు సమాచారం.
చోరీ విషయం గుర్తించిన వైన్‌షాపుల నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిశీలించి, చోరీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ దుండగుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
