FSSAI Paneer Rules
* నకిలీ పనీర్‌పై పూర్తి నిషేధం
ఆకేరు న్యూస్, నెట్వర్క్ : దేశంలోని శాఖాహారులకు అత్యంత ఇష్టమైన పనీర్ వినియోగంపై భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) కఠిన నిబంధనలకు శ్రీకారం చుట్టింది. పాలతో కాకుండా ఇతర కృత్రిమ పదార్థాలు లేదా ప్రత్యామ్నాయ పదార్థాలతో తయారు చేసే అనలాగ్ (సారూప్య కృత్రిమ) పనీర్ తయారీ, విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. ఈ మేరకు FSSAI ఒక కీలకమైన ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
* తప్పుదారి పట్టించే పేర్లకు పూర్తి చెక్
మార్కెట్లో అసలైన పనీర్‌కు బదులుగా తక్కువ నాణ్యత గల కృత్రిమ ఉత్పత్తులను అంటగట్టి, వినియోగదారులను తప్పుదారి పట్టించే మోసాలకు అడ్డుకట్ట వేయడమే ఈ సవరణ ప్రధాన ఉద్దేశం. డెయిరీ ఉత్పత్తుల విభాగంలో గతంలో అనుమతించిన లేదా నమోదు చేసిన అనలాగ్ ఉత్పత్తుల నామకరణం, లేబులింగ్ లేదా మార్కెటింగ్‌లో ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ పనీర్ అనే పదాన్ని ఉపయోగించడాన్ని నిషేధించనున్నారు.
* సవరణ నిబంధనల అమలు
నిబంధనల ప్రకారం, పాల ఉత్పత్తులు కాని పదార్థాలతో తయారయ్యే ఏ పదార్థాన్ని కూడా పనీర్గా విక్రయించడానికి అవకాశం ఉండదు. ఈ ముసాయిదా నోటిఫికేషన్ గెజిట్‌లో ప్రచురించబడిన సెప్టెంబర్ 23 నుండి అరవై రోజులల్లోగా అభ్యంతరాలు, సూచనలు ఉంటే ప్రధాన కార్యనిర్వాహణాధికారి, భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ, ఎఫ్‌డిఎ భవన్, కోట్లా రోడ్, కొత్త ఢిల్లీ – 110002 చిరునామాకు లేదా regulation@fssai.gov.in ఇమెయిల్ ద్వారా తమ అభిప్రాయాలను పంపవచ్చు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
