Rayaparthy
* ఎంపీఓ కూచన ప్రకాష్
Rayaparthy| ఆకేరు న్యూస్, రాయపర్తి: మండలంలోని మైలారం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం స్వచ్ఛతే సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ చిర్ర వేణు ముఖ్య అతిథిగా హాజరుకాగా, రాయపర్తి మండల పరిషత్ అధికారి (ఎంపీఓ) కూచన ప్రకాష్ ప్రత్యేకంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీఓ కూచన ప్రకాష్ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. చిన్ననాటి నుంచే పరిశుభ్రతను అలవాటుగా మార్చుకోవాలని, ఇల్లు, పాఠశాల, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. పరిశుభ్రమైన వాతావరణంతో ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
గ్రామ సర్పంచ్ చిర్ర వేణు మాట్లాడుతూ.. గ్రామం, పాఠశాలను పరిశుభ్రంగా ఉంచేందుకు గ్రామపంచాయతీ తరఫున అన్ని విధాలా కృషి చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులే రేపటి పౌరులని, స్వచ్ఛ భారత్ లక్ష్య సాధనలో వారి పాత్ర కీలకమని అన్నారు. పరిశుభ్రమైన వాతావరణం మానసిక ప్రశాంతతను కలిగించడంతో పాటు చదువుపై ఏకాగ్రత పెంచుతుందని పేర్కొన్నారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, పంచాయతీ సిబ్బంది శ్రమదానం చేసి పరిసరాలను శుభ్రం చేశారు. స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు ఏ. ఉమాదేవి, ఉపాధ్యాయులు ఎండీ. అజయ్, మున్నీసా బేగం, పంచాయతీ కార్యదర్శి విజేందర్, గ్రామపంచాయతీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
