Nani
Nani| ముంబై: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ది ప్యారడైజ్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ముంబైలో నిర్వహించిన ప్రెస్మీట్లో నాని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు నవ్వులు పూయించాయి.
బాజిగర్ నా ఫేవరెట్
షారుఖ్ ఖాన్ నటించిన ‘బాజిగర్’ తనకు ఎంతో ఇష్టమైన కమర్షియల్ సినిమా అని నాని తెలిపారు. ఆ సినిమా తనపై ప్రత్యేకమైన ప్రభావం చూపిందని, షారుఖ్ నటన, ఆయన తెరపై కనిపించే తీరు తనను ఎంతగానో ఆకట్టుకుంటాయని చెప్పారు.
పారితోషికంపై చమత్కారం
షారుఖ్ ఖాన్, తన శరీర కొలతలు దాదాపు ఒకేలా ఉంటాయని నాని సరదాగా వ్యాఖ్యానించారు. “షారుఖ్ ఖాన్, నా కొలతలు సరిగ్గా ఒకటే. మా ఇద్దరికీ ఒకే పారితోషికం ఉంటే ఇంకా బాగుండేది” అంటూ చమత్కరించారు. నాని వ్యాఖ్యలతో ప్రెస్మీట్లో నవ్వులు పూశాయి.
భారీ అంచనాలతో ‘ది ప్యారడైజ్’
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన దసరా విజయవంతం కావడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
