Palakurthi Gurukulam
Palakurthi Gurukulam| ఆకేరు న్యూస్, పాలకుర్తి:విద్యార్థుల భద్రత విషయంలో పాలకుర్తి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజ్ యాజమాన్యం, సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని SFI, CPM, ప్రజాసంఘాల నాయకులు ఆరోపించారు. గురుకులంలో చోటుచేసుకున్న ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం పాఠశాల ప్రధాన గేటు వద్ద ధర్నా నిర్వహించారు.
భద్రత కల్పించడంలో విఫలం
ఈ సందర్భంగా SFI జనగామ జిల్లా అధ్యక్షుడు పొదల లవకుమార్, CPM జిల్లా కమిటీ సభ్యుడు చిట్యాల సోమన్న మాట్లాడుతూ.. అధికారుల బాధ్యతారాహిత్యం కారణంగా గురుకులంలో చదువుతున్న విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. విద్యార్థులకు కనీస భద్రత కల్పించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.
చర్యలు తీసుకోవాలని డిమాండ్
ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, గురుకులాల కార్యదర్శి తక్షణమే స్పందించి నిర్లక్ష్యం వహించిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే పాలకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
అనంతరం విద్యార్థుల భద్రతకు సంబంధించి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని పాలకుర్తి మండల తాసిల్దార్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో CPM మండల కమిటీ సభ్యులు ఎదునూరి మదర్, ముసుకు ఇంద్రారెడ్డి, SFI జనగామ జిల్లా గర్ల్స్ కన్వీనర్ కడారి మానస, మండల అధ్యక్ష, కార్యదర్శులు, నాయకులు ప్రశాంత్, శ్రీకాంత్, అరవింద్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు..

Please tell us what is wrong. Your report will be sent to the website team.
